అక్షరబద్ధం చేసిన ప్రయాణ విశేషాలు అద్భుతం : ఓరుగంటి సుధాకర్
- vinoo Sparkles
- Dec 3, 2024
- 1 min read
కాశీ కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, భక్తులకు దైవ భూమి. ఔత్సాహికులకు పరిశోధనా కేంద్రం, టూరిస్టులకు పర్యాటక ప్రాంతం, విజ్ఞాన నగరి - అందుకే తీరిక లేకుండా తిరిగిన తీరని దాహం కాశి ప్రయాణం అని ఉపోద్ఘాతంలో రచయిత వాక్యం. చంద్రశేఖర్ ఆజాద్ బాల్యం ప్రస్తావనతో మొదలుపెట్టి, గంగా హారతి, మణికర్ణిక ఘాట్ లో కాలే చితుల గురించి, యాత్ర చరిత్రకారుడు రాహుల్ సాంకృత్యాయన్ ని తలపోస్తు, కాశీనగరం చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలు ప్రత్యేకించి సిల్క్ విలేజ్ ఆఫ్ బెనారస్ గా పిలిచే సారయ్ మోహన గురించి, మాన్ మందిర్ ప్యాలెస్ లోని అబ్జర్వేటరీ గురించి, బుద్ధుని తొలి దర్మోప దేశ ప్రదేశం సారానాథ్ , సారనాథ్ మ్యుజియం గురించి, వేల సంవత్సరాల కిందట మానవాళికి విముక్తి మార్గాన్ని ప్రబోధించిన బుద్ధుని యొక్క నిర్వాణo చెందిన కృషినగర్ సందర్శన అనుభవాల వివరణ తో ముగుస్తుంది ఈ రచన.
కాశీని కేవలం ఒక పుణ్యక్షేత్ర దర్శనంగా భావించే వారికి ఈ పుస్తకం అంతగా నచ్చకపోవచ్చు ఏమో కాని, ఒక యువ ట్రావెలర్ అక్షరబద్ధం చేసిన ప్రయాణ విశేషాలు అధ్భుతం గా వుంది.
- Oruganti Sudhakar
Comments